ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ వారి జాతర మహోత్సవాలు రద్దు అయ్యాయి. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కుటుంబ సభ్యుల సమక్షంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. ఉత్సవాలను నిరాడంబరంగా ప్రారంభించారు.
ప్రజలందరూ కరోనా బారిన పడకుండా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లో వారు అమ్మవారిని పూజించుకోవాలని కోరారు. ప్రతి ఏటా మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఉత్సవాలు సాధారణంగా జరుగుతుండడంపై భక్తుల్లో అసంతృప్తి నెలకొంది.
ఇదీ చదవండి: