కార్తీక మాసం ప్రారంభం కావడంతో విశాఖలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. రోలుగుంటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర మృత్యుంజయ ఆలయంలో ... నిర్వాహకులు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆలయంలో ప్రధానంగా 108 నల్లరాతి శివలింగాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. అలాగే ఏకశిలపై సహస్ర సూక్ష్మ లింగాలను తీర్చిదిద్దడం మరింత విశేషంగా పేర్కొనవచ్చు. రోలుగుంటకు పశ్చిమ దిశలో గౌరమ్మ కోనేరులో ఈ మృత్యుంజయ ఆలయాన్ని నిర్మించారు. కార్తీకమాసంలో ఇక్కడికి నర్సీపట్నం , రావికమతం , మాకవరపాలెం , నాతవరం , కోటవురట్ల, గొలుగొండ... మండలాలకు చెందిన భక్తులు వందలాది సంఖ్యలో వస్తుంటారు. అందుకు అనుగుణంగా ఆలయాన్ని నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ కారణంగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
ఇదీ చదవండీ...