విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ భూసేకరణ పనులను తక్షణం పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. ఈనెల చివరికల్లా రికార్డు పని పూర్తి కావాలన్నారు. నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, వేంపాడు, చందనాడ, డి.ఎల్. పురం గ్రామాలలో భూసేకరణలో క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలపై సమీక్షించారు. పట్టా భూములు, ప్రభుత్వ, దేవాదాయ, డిఫామ్, ఆక్రమణ భూముల వివరాలను పరిశీలించి…ఏ విధంగా సేకరించాలి, పరిహారం నిబంధనలను తయారు చేయాలన్నారు. ప్రస్తుతం రికార్డులు సిద్ధంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవసరమైతే ఇతర విభాగాల్లో, ఇతర మండలాలకు చెందిన సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్లను కూడా డిప్యుటేషన్‌పై నియమించుకోవాలని సూచించారు. చందనాడ, వేంపాడు గ్రామాలపై పూర్తి దృష్టి సారించాలన్నారు. దేవాదాయ భూములకు సంబంధించి పూర్తి వివరణ పొంది ముందుకు వెళ్లాలన్నారు. భూసేకరణ, పరిహారం విషయంలో ఎటువంటి విమర్శలు రాకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ఇవీ చదవండి: విశాఖలో డీజీపీ గౌతమ్ సవాంగ్ రహస్య పర్యటన!