ETV Bharat / state

లేటరైట్‌ మైనింగ్‌ ప్రాంతంలో.. నేలకొరిగిన వృక్షాలెన్నో! - latest news in vishaka district

పచ్చని పొదలు, భారీ వృక్షాలతో నిండుగా ఉండే బమిడికలొద్ది కొండ ప్రాంతం.. ఇప్పుడు లేటరైట్‌ తవ్వకాలతో రూపు మారిపోయింది. చెట్లన్నీ గొడ్డలి వేటుకు గురయ్యాయి. కొండ పైభాగమంతా భారీ మైదానాన్ని తలపిస్తోంది. వాహనాల రాకపోకలకు క్వారీ నిర్వాహకులు నిర్మించిన రహదారులతో బండరాళ్లన్నీ పిండిలా మారిపోయాయి. ఇవన్నీ అధికారులకు తెలియకుండానే జరిగిపోయాయంటే ఎవరైనా నమ్ముతారా..?

mining‌ area
మైనింగ్‌ ప్రాంతంలో కనిపించని వృక్షాల
author img

By

Published : Aug 23, 2021, 10:46 AM IST

విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు రెవెన్యూ పరిధిలోని బమిడికలొద్ది లేటరైట్‌ క్వారీలో భారీ వృక్షాలను మాయం చేశారు. పెద్ద,పెద్ద చెట్లతో కనిపించాల్సిన ప్రాంతం మైదానాన్ని తలపిస్తోంది. ఈ విధ్వంసం గురించి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నియమించిన అధికార బృందం పర్యటించే వరకు ఎవరూ గుర్తించలేదు. క్వారీకి అనుమతులు ఉన్నాయనే సాకుతో పచ్చని చెట్లను నేలమట్టం చేసినా.. కొండలను తవ్వి భారీ రోడ్లు నిర్మించినా అధికారులంతా కనీసం కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు కూడా మా శాఖ పరిధి కాదంటే మాది కాదని తప్పించుకోవాలని చూస్తున్నారు.

జగనన్న కాలనీల్లో అలా..

లీజుదారు క్వారీకి మాత్రమే అనుమతులు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న చెట్లను తొలగించాలంటే తప్పనిసరిగా రెవెన్యూ, అటవీ శాఖల అనుమతులు పొందాలి. ఇదే విషయాన్ని ఎన్జీటీ బృందం అటవీ అధికారులను అడిగితే ముందు తడబడినా.. వెంటనే తమను ఎవరూ అడగలేదని చెప్పడం వారి పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది. ఈ ప్రాంతంలో విలువైన వృక్ష సంపద ఉంది. ఒకవేళ ప్రభుత్వ అనుమతితోనే చెట్లను తొలగించినా, వాటిని అధికారులకు అప్పగించాలి. వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. ఇటీవల జగనన్న కాలనీలకు గుర్తించిన స్థలాల్లో చెట్లను తొలగించాల్సి వచ్చినప్పుడు ఇలానే చేశారు.

నర్సీపట్నంలోనే గబ్బాడలో జలవనరుల శాఖకు చెందిన మూడు ఎకరాల స్థలంలో చెట్లను వేలం వేయగా రూ.90 వేల ఆదాయం వచ్చింది. మరి బమిడికిలొద్ది ప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు నిర్మాణానికి.. మైనింగ్‌ ప్రాంతంలోనూ వేలాది చెట్లను తొలగించారు. వీటన్నింటిని వేలం వేస్తే ఎంతో ఆదాయం వచ్చేదని సంబంధిత శాఖ అధికారి ఒకరు చెబుతున్నారు. క్వారీ ప్రాంతం అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని రెవెన్యూ వాళ్లు, అది రిజర్వు ఫారెస్ట్‌ కాదు కాబట్టి రెవెన్యూదేనని అటవీ శాఖ వాళ్లు చెబుతుండటం గమనార్హం. ఈలోగా చెట్లన్నీ మాయమైపోయాయి. నేలకూలిన వృక్షాల ఆనవాళ్లు లేకుండా చేశారు. అనుమతుల్లేకుండా చెట్లను తొలగించడం వల్లే వాటిని ఎన్జీటీ బృందానికి కనిపించకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

టిడ్కో, గృహ నిర్మాణ సంస్థ చేతికి.. అగ్రిగోల్డ్ స్థలాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.