అన్నమయ్య రాసిన 32 వేల సంకీర్తనల్లో 13 వేల వరకు లభ్యమయ్యాయి. వాటిలో 5వేల కీర్తనలకు పలువురు స్వర కల్పన చేశారు. ఆ కీర్తనల్లో ఎక్కువగా వినేవి కాకుండా.. ప్రాచుర్యం లేనివి ఎంచుకున్న విశాఖ వాసి సోమసుందర్రావు.. అర్థంతో సహా దృశ్యరూపకం చేసి వెలుగులోకి తీసుకొచ్చారు. 2010 నుంచి ఇప్పటివరకు 3 వేల 990 కీర్తనలు సేకరించగా.. అందులో వెయ్యికి పైగా దృశ్యరూపం దాల్చాయి. ఆయన చేసిన ఈ కృషికి.. ఈ ఏడాది మార్చిలో 'ఇండియా వరల్డ్ రికార్డు', మేలో 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డు' గుర్తింపు లభించింది.
విశాఖలో హెడ్ పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వర్తించిన సోమసుందర్రావు.. 2012లో పదవీ విరమణ పొందారు. ఆయన భార్య సంధ్యాసుందర్.. ఆల్ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్‌గా పనిచేశారు. కళా భారతిలో జరిగిన సంగీత కచేరిలో 25 గంటలు నిర్విరామంగా గాత్రం చేసి గిన్నిస్ బుక్, లిమ్కా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు సొంతం చేసుకున్నారు. సంగీతంపై ఆసక్తి ఉన్నవారికి ఈ దంపతులు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే అవకాశం ఉంటే.. దృశ్యరూపమిచ్చిన అన్నమయ్య కీర్తనలన్నింటినీ అందిస్తానని సోమసుందర్రావు చెబుతున్నారు.
ఇదీ చదవండీ.. Accident: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-కారు ఢీ