ETV Bharat / state

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు - విశాఖ జిల్లా తాజా వార్తలు

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ఏపీఎస్​ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. విశాఖతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరీక్షలు రాసేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు విశాఖ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎం.వై దానం తెలిపారు. కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

m.y. daanam
ఎం.వై. దానం, విశాఖ ఆర్టీసీ రీజినల్ మేనేజర్
author img

By

Published : Sep 17, 2020, 2:48 PM IST

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం విశాఖ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. మరో వైపు త్వరలో నగరంలో సిటీ బస్సులను తిప్పడానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే వైద్య శాఖకు లేఖ రాసినట్లు చెప్తున్న విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎంవై దానంతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి..

ప్రశ్న: గ్రామ ,వార్డు సచివాలయ పరీక్షల అభ్యర్థులకు విశాఖ ఆర్టీసీ ఎలాంటి సేవలు అందిస్తోంది?

జవాబు: కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాలతో ఈసారి వార్డు, గ్రామ సచివాలయ పరీక్షలకు ప్రత్యేక బస్సులు నడపుతాము. రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్ నుంచి పరీక్ష కేంద్రాలకు ఈ సర్వీసులు నడుస్తాయి. పరీక్ష జరుగుతున్నంత సేపు అక్కడే ఉండి తిరిగి పరిక్ష ముగిసిన తరువాత అభ్యర్థులను వారి గమ్య స్థానాలకు చేర్చుతాం. ఇప్పటికే ఇందుకు అవసరమైన బస్సులను సిద్ధం చేశాం.

ప్రశ్న : ఆన్ లాక్ ప్రక్రియ మొదలైంది. నగరంలో సిటీ బస్​లు ఎప్పటి నుంచి తిరుగుతాయి?

జవాబు: ఈ విషయమై వైద్యశాఖకు లేఖ రాశాం. వారి నుంచి అనుమతులు వచ్చాక నగర పరిధిలో బస్సులను తిప్పే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తాం. కొవిడ్ నియమాలకు అనుగుణంగా ఈ సర్వీసులు నడుస్తాయి.

ఇవీ చదవండి...

సైకత కళతో మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.