ETV Bharat / state

విశాఖ చేరుకున్న సభాపతి తమ్మినేని సీతారాం

సభాపతి తమ్మినేని సీతారాం విశాఖ చేరుకున్నారు. పలు పాఠశాలల విద్యార్థులు భారీఎత్తున తరలివచ్చి... స్పీకర్​కు స్వాగతం పలికారు.

author img

By

Published : Jan 31, 2020, 7:43 PM IST

speaker in vizag
విశాఖకు చేరుకున్న స్పీకర్ తమ్మినేని
విశాఖ చేరుకున్న సభాపతి తమ్మినేని సీతారాం

సభాపతి తమ్మినేని సీతారాం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... చట్టాలు అందరికీ సమానమేనని... ఎవరికీ చుట్టం కాదన్నారు. అమరావతి రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉందా..? అని ఓ విలేకరి ప్రశ్నించగా... ప్రభుత్వం తరఫు కమిటీ మాట్లాడుతుందనీ, ఆ విషయాన్ని శాసనసభలో ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. నిజమైన ఉద్యమాలకు మద్దుతు ఇద్దామనీ, కృత్రిమ ఉద్యమాల గురించి ప్రస్తావించవద్దంటూ అసహనం వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఇబ్బందులు..!

విశాఖ విమానాశ్రయంలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు స్వాగతం పలికేందుకు పాఠశాలల విద్యార్థులు పడిగాపులు కాశారు. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ పేరిట ఉన్న ఓ సంస్థ పాఠశాల విద్యార్థులను సమీకరించి విమానాశ్రయానికి తీసుకొచ్చింది. ఉదయ 9 గంటలకు విద్యార్థులు ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. స్పీకర్ పదకొండున్నర గంటలకు వచ్చారు. అప్పటికే చాలామంది విద్యార్థులు నీరసించిపోయారు.

ఇదీ చదవండి: 'జిల్లాలో గజం భూమి కూడా కబ్జా కానివ్వను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.