భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా... విశాఖ జిల్లాలో స్పేస్ ఆన్ వీల్స్ పేరిట విద్యార్థులకు ఇస్రో విజయాలు, ఉపగ్రహాల పనితీరుపై అవగాహన కల్పించనున్నారు. దీని కోసం ఆగస్టు నెలలో అంతరిక్ష ప్రదర్శన వాహనాన్ని ప్రారంభించారు. ఆర్యభట్ట, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్ సిస్టమ్, రాకెట్ ఇంజిన్ స్పేస్ మిషన్, చంద్రయాన్, మంగళయాన్ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రదర్శనంతా మెుబైల్ వాహనంలో ఉంటుంది. ఇప్పటికే ఈ వాహనం తగరపు వలస చేరుకుంది. యువతను అంతరిక్షం వైపునకు ఆకర్షించేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. శ్రీహరికోటలో ఉన్న షార్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు జరుగుతాయి. ఒక్కో వాహనంలో ముగ్గురు చొప్పున యువశాస్త్రవేత్తలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
ఇవీ చదవండి...ఇస్రో ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు