పాయకరావుపేట నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారించేందుకుగాను చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు. ఇందుకుగాను రూ. 70 కోట్లతో జల జీవన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 60 వేల ఇళ్లకు తాగునీటిని అందించేందుకు ఈ పథకం ద్వారా వీలవుతుందన్నారు. దీనికి సంబంధించిన నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి :