అనకాపల్లిలో దారుణం... ఆస్తి కోసం కుటుంబ సభ్యులపై కత్తితో దాడి - అనకాపల్లి లేటెస్ట్ న్యూస్
ఆస్తి కోసం ఓ వ్యక్తి కన్నతల్లితో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. అనకాపల్లి లక్ష్మీ దేవిపేటకు చెందిన ఆకుల రాజబాబు.. ఆస్తి తగాదాలో తల్లి అప్పల నరసమ్మ, సోదరుడు పుష్పరాజు, సోదరి లక్ష్మి, బావ బాబురావులపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి తరలించారు. నిందితుడు రాజబాబుని అనకాపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనకాపల్లిలో దారుణం... ఆస్తి కోసం కుటుంబసభ్యులపై దాడి