ETV Bharat / state

అందరూ మహిళలే... రూ. 75లక్షల వ్యాపారం చేశారు - women

వినూత్న ఆలోచనతో మహిళలు వ్యాపారంలో రాణిస్తున్నారు. పల్లెల్లో పండిన పంటను పట్టణాల్లో విక్రయిస్తూ లాభాలు అర్జిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన చిరుధాన్యాలను సేకరించి వాటి పాత పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేసి అమ్ముతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను నడిపిస్తోంది మహిళలే కావడం విశేషం.

చిరుధాన్యాలు
author img

By

Published : Sep 7, 2019, 7:02 AM IST

పల్లె పంటను పట్టణాల్లో విక్రయం... లాభసాటిగా వ్యాపారం

చిరుధాన్యాల వ్యాపారంతో లాభాల బాట పడుతున్నారు విశాఖ జిల్లాకు చెందిన కొందరు నారీమణులు. సుసాగ్​ చిరుధాన్యాల ఉత్పత్తి సంఘాన్ని ఏర్పాటు చేసి... అనకాపల్లి మండలం మామిడిపాలెంలో కార్యాలయాన్ని ప్రారంభించారు. పల్లెల్లో పండించిన చిరుధాన్యాలను రైతుల నుంచి సేకరించి పట్టణాల్లోని అపార్ట్​మెంట్లలో ఉంటున్న వారికి విక్రయించాలనేది వీరి ఆలోచన. వీరికి ఎస్​వీడీఎస్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారం తోడుగా నిలిచింది. నాబార్డు కూడా సహకరించటంతో వీరికి ఆలోచన కార్యరూపం దాల్చింది.
అందరూ మహిళలే
విశాఖ జిల్లా పెదబయలు, అనకాపల్లి మండలాల్లో సుమారు 2000 ఎకరాల్లో సేంద్రీయ విధానంలో చిరుధాన్యాలు, పప్పు దినుసుల సాగును ఈ సుసాగ్ సంఘం ప్రోత్సహిస్తోంది. మొత్తం 32 పంచాయతీల నుంచి చిరు ధాన్యాలను సేకరిస్తున్నారు. సంఘంలో మొత్తం 960 మంది మహిళా రైతు సభ్యులుగా ఉన్నారు. వీరి పండించిన పంటను గిట్టుబాటు ధరతో సేకరిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు 15 మందిని ఉద్యోగులుగా నియమించుకున్నారు.
పాత పద్ధతుల్లో ప్రాసెసింగ్
రైతుల నుంచి సేకరించిన చిరుధాన్యాలను పాత పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేస్తున్నారు. వాటిల్లోని పోషకాలు పోకుండా తిరగళి వినియోగించటం, చేతితో విసరటం వంటివి చేస్తున్నారు. గంటి, చోడి , సామ, కొర్ర, వరిగెలు, మినుము, పెసర, బొబ్బర, ఉలవ, సోయాబీన్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత వీటిని ప్యాకింగ్ చేసి అపార్ట్​మెంట్లలో విక్రయిస్తున్నారు. చిరుధాన్యాల నుంచి వివిధ పిండివంటలు, బిస్కెట్లు వంటివి తయారుచేసి అమ్ముతున్నారు.
75 లక్షల రూపాయలకు చేరిన అమ్మకాలు
సంఘంలో చేరేందుకు రైతుల నుంచి సభ్యత్వ రుసుముగా రూ.500 తీసుకున్నారు. ఇలా వసూలైన రూ.4.80 లక్షలతో మూడేళ్ల క్రితం వ్యాపారాన్ని ప్రారంభించారు. తొలి ఏడాది రూ.8 లక్షల వ్యాపారం చేశారు. రెండో ఏడాది రూ.18 లక్షల వ్యాపారం చేశారు. మూడో ఏడాది ఇది రూ.75 లక్షలకు చేరింది. మరో సంవత్సరం పూర్తయ్యే నాటికి రూ.కోటి విలువైన వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట్లో కొంత నష్టం వచ్చినప్పటికీ తప్పులు సరిదిద్దుకుని ప్రస్తుతం లాభాలు గడిస్తున్నారు. సంఘానికి నాబార్డు అండగా నిలిచింది. మహిళలకు శిక్షణ నిమిత్తం మూడేళ్లలో 9.05 లక్షలు ఖర్చు చేసింది. సంఘానికి నా బార్డు ఏ గ్రేడ్ ఇచ్చింది.

Intro:

Body:నరసన్నపేట

Conclusion:9440319788

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.