సింహాచలం అప్పన్నకు 19 రోజుల్లో రూ.79 లక్షలకు పైగా ఆదాయం - AP FAMOUS TEMPLES
విశాఖ జిల్లా సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో.. హుండీ ఆదాయాన్ని ఆలయ సిబ్బంది లెక్కించారు. 19రోజులకు గాను 79 లక్షల 16 వేల 178 రూపాయల నగదుతో పాటు... 81 గ్రాముల బంగారు వస్తువులు, 6 కేజీల వెండి వస్తువులు, వివిధ దేశాలకు చెందిన కరెన్సీ వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ సారి హుండీ ఆదాయం పెరిగిందన్నారు.