సమస్య తెలిసిన వారే పంచ గ్రామాల భూ సమస్య పరిష్కరించగలరు. సింహాచల దేవస్థాన భూ సమస్యలపై ప్రభుత్వం కమిటీ వేయడాన్ని తెలుగుదేశం స్వాగతిస్తోంది. కానీ సమస్య తెలిసిన ఎమ్మెల్యేలను తీసుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతుందే కానీ తగ్గదు. అదే పూర్తిగా అవగాహన ఉన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ని కమిటిలోకి తీసుకోవడం వల్ల సులువుగా పరిష్కారమవుతుందని, వారిని వెంటనే కమిటీలోకి తీసుకోవాలని మాజీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పాతర్ల ప్రసాద్ కోరారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిని ఆలయ ఈవో రామచంద్రమోహన్ తప్పుబట్టారన్నారు. అందుకే ఈ సమస్య పరిష్కారం కాలేదని, రామచంద్రమోహన్ని వెంటనే కమిటీ నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆక్రమణదారులుగా చిత్రీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని.. ఈ సమస్యపై పూర్తిస్థాయిలో అవగాహన ఆలయ ఈవోకి లేదన్నారు. ఇదీ చూడండి:చీపురుపల్లి జ్ఞాపకార్థం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ