కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. లాక్డౌన్ కారంణంగా అనేక వ్యాపారాలు మూతపడ్డాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు వసతుల లేమి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. అరకొర సదుపాయాలతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలోని ఓనకడిల్లి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కావడానికి ప్రతిరోజూ 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వస్తోంది.
అంత దూరం ప్రయాణించి.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జియో సిగ్నల్ పై ఆధారపడుతున్నారు. ఓనకడిల్లి, మాచ్ఖండ్లలో బీఎస్ఎన్ఎల్ సేవలు ఉన్నప్పటికి అంతర్జాలంలో వేగం లేక నడిరోడ్డుపైనే విద్యార్థులు పాఠాలు వినవలసి వస్తుంది. మాచ్‌ఖండ్, ఓనకడిల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్ధులు విశాఖపట్నం, భువనేశ్వర్, కొరపుట్, జయపురం పట్టణాల్లో ఉన్నత విద్య చదివారు. లాక్డౌన్ కారణంగా వారంతా .. స్వస్థలానికి వెళ్లారు. ఇప్పుడు ఆన్ లైన్ క్లాసుల కోసం ఇలా కష్టాలు పడుతున్నారు.
ఇదీ చదవండి: