ETV Bharat / state

మాడుగుల ఎస్​ఐ సాహసం.. నదిలో దూకి మృతదేహం వెలికితీత

author img

By

Published : Aug 4, 2021, 8:01 AM IST

విశాఖ జిల్లా మాడుగులలోని పెద్దేరులో ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు తెచ్చేందుకు.. ఎస్సై సాహసం చేశారు. పోతనపూడి-వడ్డాది మధ్య పెద్దేరులో మంగళవారం రాత్రి 9గంటలకు గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందారు. దీంతో మృతదేహాన్ని వెలికితీసేందుకు ఎస్సై పి.రామారావు.. ప్రవాహంలో దూకి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు.

si extracted dead body from the river at pedderu
మాడుగుల ఎస్సై సాహసం.. నదిలో మృతదేహాన్ని వెలికితీత

విశాఖ జిల్లా మాడుగులలోని పెద్దేరులో ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు తెచ్చేందుకు ఎస్సై పి.రామారావు సాహసం చేశారు. పోతనపూడి-వడ్డాది మధ్య పెద్దేరులో మంగళవారం రాత్రి 9గంటలకు గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఎస్సై ప్రవాహంలో దూకి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు.

బుచ్చయ్యపేట ఎస్సై రామకృష్ణ, కానిస్టేబుల్ వెంకటరావు సహకరించారు. చోడవరం సీఐ అలియాస్ మహమ్మద్ ఎస్సైని అభినందించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామారావు తెలిపారు.

ఇదీ చదవండి:

సర్కారీ పాఠశాలల వ్యధ.. అంతులేని కథ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.