ETV Bharat / state

విశాఖ మ‌న్యంలో రూ.60 ల‌క్ష‌లు విలువైన గంజాయి ప‌ట్టివేత‌ - విశాఖ జిల్లాలో గంజాయి పట్టివేత

విశాఖ ఏజెన్సీ సీలేరులో అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 60 లక్షలు విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశాఖ మ‌న్యంలో రూ.60 ల‌క్ష‌లు విలువైన గంజాయి ప‌ట్టివేత‌

author img

By

Published : Aug 5, 2021, 12:04 PM IST

విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుబడింది. సీలేరులో అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 60 లక్షలు విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారం ప్రకారం సీలేరు జెన్​కో తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా... ధారికొండ నుంచి వస్తున్న లారీని పోలీసులు అనుమానం వచ్చి నిలిపివేశారు. లారీని తనిఖీ చేయగా ప్యాకింగ్ చేసిన గంజాయి పట్టుబడింది.

స్వాధీనం చేసుకున్న గంజాయి 400 కిలోలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. గంజాయిని రాజస్థాన్ తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. వారి నుంచి రూ. 5600 నగదు, రెండు చరవాణీలను స్వాధీనం చేసుకున్నట్లు సీలేరు ఎస్సై రంజిత్ తెలిపారు. బహిరంగా మార్కెట్​లో ఈ గంజాయి విలువ రూ. 60 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేశారు.

ఇదీ చదవండి: Olympics: రవి ఫైనల్​ పోరు.. కాంస్యం కోసం హాకీ జట్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.