విశాఖ గిరిజన ప్రాంతాన్ని వ్యవసాయానికి పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. పూర్వకాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తాము పండించిన పంటలో మొదటి గంపను.. భగవంతునికి నైవేథ్యంగా సమర్పించడం వీరు ఆచారంగా భావిస్తారు. దీనినే సీతాలు పండుగగా జరుపుకొంటారు. వరి కల్లంలో నూర్చిన ధాన్యాన్ని రాశులుగా వేస్తారు. కుటుంబ పెద్ద తొలి గంప ధాన్యాన్ని తల పై పెట్టుకుని.. రాసుల చుట్టూ తిరిగి భగవంతునికి నైవేథ్యంగా అర్పిస్తారు. మన్యంలో ఈ ఆచారం అనేది పూర్వకాలం నుంచి తరతరాలుగా వస్తూ.. ఎంతో ఆధరాభిమానం పొందింది.
గ్రామంలోని పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సైతం వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతూ.. తమ ఆచార సాంప్రదాయాలను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన బాబూరావు నాయుడు కడప కలెక్టర్గా, పునరావాస శాఖ కమిషనర్గా విధులు నిర్వహించారు. డిసెంబర్ 30న పదవీ విరమణ చేశారు. అనంతరం గ్రామంలోని వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తన పొలంలో వరి రాశులను ఏర్పాటు చేసి, సీతాలు పండుగలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ విధుల్లో తలమునకలైన తాను.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.