ETV Bharat / state

విశాఖ నుంచి సింగపూర్​కి... ఇక స్కూట్​లో..!

విమాన ప్రయాణికులకు సింగపూర్ విమానయాన సంస్థ తీపి కబురు తెచ్చింది. స్కూట్ ఎయిర్ లైన్స్.. సింగపూర్- విశాఖల మధ్య సర్వీసులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. అక్టోబర్ నుంచి స్కూట్ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

విశాఖ నుంచి సింగపూర్​కి... ఇక స్కూట్​లో..!
author img

By

Published : Aug 30, 2019, 5:42 AM IST

విశాఖ నుంచి సింగపూర్​కి... ఇక స్కూట్​లో..!
విశాఖ నుంచి ఒక్కటొక్కటిగా విమాన సర్వీసులు నిలిపిపోతున్న తరుణంలో...సింగపూర్ విమానసంస్థ స్కూట్ ఎయిర్ లైన్స్ విశాఖ నుంచి సర్వీసులు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. సింగపూర్ ఎయిర్ లైన్స్ సర్వీసుల స్థానంలో స్కూట్ విమానం విశాఖ-సింగపూర్ మధ్య ఎగరనుంది. విశాఖ నుంచి సింగపూర్​కు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ అవకాశాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా స్కూట్ సంస్థ అడుగు వేసింది. ప్రస్తుతం సింగపూర్ విమానం వారానికి మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే స్కూట్ విమానం మాత్రం మంగళవారం, గురువారం మినహా మిగిలిన రోజుల్లో ప్రయాణికులకు సేవలు అందించనుంది.

స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం సీట్ల సంఖ్య కూడా 180 వరకు ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విమాన ప్రయాణ టిక్కెట్టు ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందంటున్నారు. పర్యాటకులను ఆకర్షించే దిశగా స్కూట్ ఎయిర్ లైన్స్ ఇరుదేశాల పర్యాటక ఆకర్షణలకు ప్రచారం కల్పించనుందని అంటున్నారు. అక్టోబర్ 27 నుంచి స్కూట్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సుమారు నాలుగుగంటల ప్రయాణ సమయంతో విశాఖ, సింగపూర్ మధ్య స్కూట్ విమానం పయనించనుంది.

ఇదీ చదవండి :

ఆకాశ వీధిలో 'విశాఖ' విమానం

Intro:ap_tpg_84_29_invijilaterlakusiksana_ab_ap10162

Body:గ్రామ సచివాలయ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ ఒకటో తేదీన జరిగే పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లు పర్యవేక్షకులుగా విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహించారు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు ఏలూరు పరిధిలోని దెందులూరు పెదవేగి పెదపాడు ఏలూరు గ్రామీణ ఏలూరు అర్బన్ లలో 20వేల 632 మంది పరీక్షలు రాయనున్నట్లు క్లస్టర్ అధికారి మనోజ్ తెలిపారు ఇందుకు సంబంధించి పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకుని సహకరించాలన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.