పాఠశాల బస్సును ఢీకొన్న లారీ.. ఆరుగురికి గాయాలు - school bus accident news in payakaraopeta
విశాఖ జిల్లా పాయకరావుపేట జాతీయ రహదారిపై... పాఠశాల బస్సును లారీ ఢీకొంది. ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన ప్రయివేట్ పాఠశాల బస్సు... విద్యార్థులతో కోటనందూరు నుంచి పాయకరావుపేట వస్తుండగా.. ప్రమాదం జరిగింది. రహదారిని దాటుతున్న సమయంలో.... వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. గాయపడిన విద్యార్థులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
school-bus-accident-in-payakaraopeta-at-visakha
Intro:విశాఖ జిల్లా పాయకరావుపేట జాతీయ రహదారిపై వై కూడలి వద్ద స్కూలు బస్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో 6 గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్ళితే...తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన ప్రయివేట్ పాఠశాల కు చెందిన బస్ కోట నందురు ప్రాంతం నుంచి విద్యార్థులను తీసుకుని పాయకరావుపేట వైపు గా వస్తుంది. రహదారి దాటే క్రమంలో అధిక వేగంతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఆరుగురు విద్యార్థులకు గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. జరిగిన స౦ఘటన పై పాయకరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...Body:HkConclusion:Bk