దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్కీమ్ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 21వేలు ఇవ్వాలని, కొవిడ్ విధుల్లో ఉన్నవారికి రక్షణ పరికరాలు, బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు.
ఇదీ చదవండి ల్యాండ్‌మైన్ మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థికసాయం