ETV Bharat / state

అప్పనకు శఠగోపం... ఆక్రమార్కుల దందా

author img

By

Published : Sep 7, 2020, 11:03 AM IST

విశాఖ సింహాచలం దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ ద్వారా అన్నదానం విభాగంలో పనిచేస్తున్న ఎడ్ల శ్రీను అనే ఉద్యోగిపై పలు ఆరోపణలు బయటపడ్డాయి. అతని ఖాతాలో గత 15 రోజులలో 6 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు

ఎడ్ల శ్రీను
ఎడ్ల శ్రీను

విశాఖ సింహాచలం దేవస్థానంలో రెండవరోజు జరిగిన ఆజాద్ విచారణలో.. తీగ లాగితే డొంక కదిలినట్టు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవుట్ సోర్సింగ్ ద్వారా అన్నదానం విభాగంలో పనిచేస్తున్న ఎడ్ల శ్రీను అనే ఉద్యోగిపై పలు ఆరోపణలు బయటపడ్డాయి. అతని ఖాతాలో గత 15 రోజులలో 6 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అన్నదానం విరాళాల పుస్తకాలను ముద్రించి అప్పన్నకు శఠగోపం పెట్టి కోట్లకు పడగెత్తాడంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

అతన్ని విధుల నుంచి తొలగించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడ్ల శీనును విధుల నుంచి తొలగించామని కమిషనర్ ఆజాద్ తెలిపారు.

ఇదీ చదవండి: విద్యుత్తు నగదు బదిలీ నిబంధనల్లో స్పష్టత కరవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.