ఆపద సమయంలో ఉన్నవారికి రక్తం అందించి వారి ప్రాణాలను కాపాడే రక్తం నిల్వ కేంద్రాలకు కరొనాఎఫెక్ట్ తగిలింది. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులో రక్త ప్యాకెట్ల కొరత ఏర్పడింది. ఆసుపత్రిలో నెలకు 250 నుంచి 300 మంది వరకు రక్తదానం చేసేవారు. లాక్డౌన్లో భాగంగా రక్తదానానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనివల్ల ప్రస్తుతం ఆసుపత్రిలో 30 వరకు రక్త ప్యాకెట్లు నిల్వ ఉన్నాయి. వచ్చేనెల 3 వరకు కేంద్రం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో... అత్యవసర వైద్యం నిమిత్తం మాత్రమే రక్తం వినియోగించాలని వైద్యులు సిబ్బందికి సూచించారు.
ఇదీ చూడండి: పోలీసుల దాతృత్వం... విశాఖ ఏజెన్సీలో నిత్యావసరాలు పంపిణీ