విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలోని పూలతోటలోని జలధారలకు ఆలయ ఛైర్మన్ సంచైత గజపతి పసుపుకుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వరాహ పుష్కరిణిని పరిశీలించారు. జలధారలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆమె అన్నారు. వీటి పునరుద్దరణ కోసం అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే పూలతోటను మరింత అభివృద్ధి చేయాలని సంచైత అధికారులను ఆదేశించారు. అనంతరం పూలతోటలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... శాస్త్రీయ నృత్యంపై ఆసక్తి చూపుతున్న మహిళలు