విశాఖ ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలకు అసరమైన వస్తువుల అమ్మకం ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్వంలో మొదటగా పాడేరు మండలం చింతగొందిలో ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. యువతులు, మహిళలు నెలసరి సమయాల్లో, గర్భస్థ రుతుసమయంలో సరైన సదుపాయలు లేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే అతి తక్కువధరకు అవసరమైన వస్తువులు పంపిణీ చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలోని ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సూచించారు.
ఇదీచూడండి.హోరాహోరీగా అండర్-19 కబడ్డీ పోటీలు