విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం వద్ద.. సర్ప నదిలో ఇసుక తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన ఎద్దులు బండ్ల యజమానులు.. రాత్రింబవళ్ళు తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఎద్దుల బండ్లపై ఇసుక సరఫరా వ్యవహారంలో.. రెవెన్యూ, పోలీస్ అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవడం వారి పాలిట వరమైంది. ట్రాక్టర్ డ్రైవర్లతో కుమ్మక్కై.. అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులూ సహకరిస్తున్నారని స్థానికులు భావిస్తున్నారు.
సగటున రోజుకి 100 నుంచి 200 బండ్లతో ఇసుక సరఫరా అవుతున్నట్టు అంచనా. ఇలాగే కొనసాగితే రానున్న వేసవి కాలంలో భూగర్భజలాలు అడుగంటుతాయని అధికారులు చెపుతున్నారు. నీటి ఎద్దడి ఏర్పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. నీటి సమస్య తలెత్తకుండా.. నదుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'టిడ్కో ఇళ్లను పంపిణీ చేయకపోవడం దారుణం'