పొట్ట చేత పట్టుకొని బిహార్ నుంచి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వచ్చిన బిహార్ వలస కార్మికులు 25 మంది... కాలినడకన స్వగ్రామానికి బయలుదేరారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో వీరికి దాతలు సాయం అందించారు. జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వీరిని గుర్లతించి.. సమాలోచన బాషా స్వచ్ఛంద సంస్థ సభ్యులు భోజన వసతి ఏర్పాటు చేశారు.
ఆ 25 మంది వలస కార్మికులను ఇంటికి పంపేందుకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తామని సంస్థ సభ్యులు డాక్టర్. శశిధర్ తెలిపారు. వారందరికీ అవసరమైన పరీక్షలు నిర్వహించి ...అన్ని అనుమతులతో బిహార్లోని వారి గ్రామాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: