విశాఖ జిల్లా చోడవరంలో రాత్రివేళ హక్కుల నేత హత్యకు గురయ్యాడు. భార్య కళ్లెదుటే ఈ ఘాతుకం జరిగింది. వివరాల్లోకి వెళితే... చోడవరానికి చెందిన మండే శ్రీను(44) సమాచార హక్కు నేతగా అక్కడ అందరికీ సుపరిచితమే! అధికారుల తీరును ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీంచటం శ్రీనుకు అలవాటు. ఏమైనా సందేహాలుంటే.. తక్షణమే సమాచార హక్కు అస్త్రాన్ని సంధించేవాడు. మంగళవారం రాత్రి ద్వారకా నగర్లోని తన ఇంటినుంచి మరోచోటకు భార్యతో కలిసి బయలు దేరాడు శ్రీను. ఇంతలోనే కొందరు వాహనాన్ని అడ్డుకున్నారు. ఏం జరుగుతుందని ఆలోచించేలోపే... రాడ్డుతో బలంగా కొట్టారు. భయంతో భార్య పరుగులు తీసింది. పెద్దపెద్దగా అరుస్తూ ఇంటివైపు పరుగులు తీసింది. అందరూ వచ్చేలోపే శ్రీను విగతజీవిగా పడి ఉన్నాడు. నిందితులు శ్రీను ముఖాన్ని ఛిద్రం చేసేశారు. మృతుడు గతంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడిగా పనిచేశాడు. ఎన్నికలకంటే ముందు రాజీనామా చేని వైకాపా గూటికి చేరారు. అధికారుల తప్పుల్ని ప్రశ్నించే శ్రీను హత్యపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.
ఇదీ చదవండీ: మహిళలే టార్గెట్.. హత్య, ఆపై అత్యాచారం