అన్‌లాక్ తరువాత విశాఖలో బస్సులు 100 శాతం సీట్లతో నడుపుతున్నారు. అంతే కాదు దసరా పండుగకు ప్రత్యేక బస్సులను వేశారు.కరోనా సమయంలో బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. కానీ ఆన్‌లాక్ నిబంధనలతో 30 శాతం సీట్లతో నడిచిన అన్ని బస్సులు ఇప్పుడు 100 శాతం సీట్లతో నడుస్తున్నాయి. ప్రయాణికులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అందుకు అనుగుణంగా .. బస్సులు విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు తిప్పుతున్నారు. విజయవాడకు 100 బస్సులు అదనంగా వేశారు. విశాఖ- శ్రీకాకుళంకు 120, విశాఖ -రాజమహేంద్రవరానికి 50, కాకినాడకు 30 ,అమలాపురం ,నరసాపురం ,రాజోలుకు 20 బస్సులను ప్రత్యేకంగా తిప్పుతున్నారు. విశాఖ ద్వారకా బస్సు కాంప్లెక్స్ తో పాటు .. మద్దిలపాలెం బస్సు స్టాప్ నుంచి దూర ప్రాంత బస్సులను తిప్పుతున్నారు.
కచ్చితంగా మాస్కు , శానిటైజర్ లు వినియోగించాలని సూచిస్తున్నారు. బస్సులను శానిటైజ్ చేయడంతో కొవిడ్ వ్యాప్తి నివారణ మార్గాలను అనుసరిస్తోంది ఆర్టీసీ.
ఇదీ చదవండి: తిరుమలలో వైభవంగా చంద్రప్రభ వాహన సేవ