లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు... ప్రభుత్వ సడలింపులతో రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. విశాఖలో ద్వారకా కాంప్లెక్స్ నుంచి ఆర్టీసీ సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తోంది. పెద్ద సంఖ్యలో సుదూర ప్రాంతాలకు తరలివెళ్లేవారు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. వారికి తగ్గట్టుగానే విశాఖ నుంచి పరిమిత ప్రాంతాలకు బస్సు సర్వీసులను నడుపుతున్నారు.
మండుతున్న ఎండల కారణంగా ప్రయాణికులకు సుఖ ప్రయాణం కోసం విశాఖ నుంచి విజయవాడ, కాకినాడ, కడప, ప్రాంతాలకు ఏసీ బస్సులను నడుపుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం ఈ బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. ప్రధానంగా ఎండ తీవ్రతను బట్టి ఏసీ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ద్వారకా బస్సు కాంప్లెక్స్‌లో అడుగుపెట్టే ప్రయాణికులకు రెండంచెలుగా చేతులు శుభ్రం చేయిస్తున్నారు. స్టేషన్లో ప్రవేశించే ముందు, బస్సు ఎక్కేటప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. ప్రయాణికులు మాస్క్ తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసకుంటున్నారు. ముందస్తు రిజర్వేషన్ ఉన్నవారిని మాత్రమే బస్సుల్లోకి అనుమతిస్తున్నారు.
ద్వారకా బస్ స్టేషన్ నుంచి రోజుకు 110 నుంచి 120 బస్సులు వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వీటి ద్వారా సుమారు నాలుగున్నర లక్షల ఆదాయం చేకూరుతోంది. ఈ విధంగానే సర్వీసులు కొనసాగితే ... లాక్డౌన్ వలన దెబ్బతిన్న ఆర్టీసీ కొంత మేర నష్టాల నుంచి బయటపడతుందన్న ఆశాభావం.. అధికారుల్లో వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: