సంక్రాంతి సందర్భంగా నడిపిన బస్సుల ద్వారా ఆర్టీసీకి లాభం చేకూరింది. రూ.2.65 కోట్ల ఆదాయం సమకూరిందని రీజనల్ మేనేజర్ ఎం.వై.దానం తెలిపారు. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నడిపిన సర్వీసుల వల్ల ఇంత మొత్తం ఆదాయం వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 8 నుంచి వివిధ ప్రాంతాలకు 908 బస్సులు, తిరుగు ప్రయాణికుల కోసం 618 ప్రత్యేక సర్వీసులు నడిపించామన్నారు.
హైదరాబాద్, విజయవాడ, నరసాపురం, భీమవరం, రాజమహేంద్రవరం, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, సోంపేట, పాలకొండ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు నడిపినట్లు వెల్లడించారు. పండగకు ముందు 3,84,461 కి.మీ..77శాతం ఆన్లైన్ రిజర్వేషన్(ఓఆర్)తో నడవగా, పండగ తరువాత 2,89,641 కి.మీ.. ఓఆర్ 84శాతంగా నమోదైందని తెలిపారు.
ఇదీ చదవండి: