తాత్కాలిక ఒప్పంద విధానంలో పనిచేసిన ఆర్టీసీ డ్రైవర్లు, ఇతర కార్మికులు.. విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. స్థానిక డిపోలో విధులు నిర్వహించిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సీఐటీయూ ఆద్వర్యంలో ఆందోళన చేపట్టారు.
కొద్ది రోజుల క్రితం తొలగించిన డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలోనూ తమను ఆదుకోకపోవడం అన్యాయమని వాపోయారు. న్యాయం చేయాలంటూ.. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలన అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు.
ఇదీ చదవండి: "యూపీలో దళితులకు భద్రత లేదు": అంబేద్కర్ సోసైటీ