పేద విద్యార్థుల ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని విశాఖ జిల్లా అరుకు ఎంపీ మాధవి పేర్కొన్నారు. విద్యాదీవెన ప్రారంభం సందర్భంగా.. సీఎం జగన్ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు పాడేరు డిగ్రీ కళాశాల నుంచి ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ హాజరయ్యారు.
రాష్ట్రానికి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి.. అమ్మఒడి, విద్యాదీవెన, రైతుభరోసా, పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎంకే దక్కుతోందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. విద్యాదీవెన కింద ఏజెన్సీకి రూ.9కోట్లు విడుదలయ్యాయని.. పీవో వెంకటేశ్వర్ తెలిపారు.
ఇదీ చదవండి: