విశాఖ జిల్లా పెందుర్తి- సబ్బవరం మార్గంలో అధికారులు తనిఖీ చేస్తుండగా అటుగా అంబులెన్స్ వచ్చింది. అత్యవసర చికిత్స కోసం ఎవరైనా వెళ్తున్నారేమో అన్న అనుమానంతో ముందు ఆపేందుకు మాదక ద్రవ్యనిరోధక శాఖ సిబ్బందిఆలోచించారు. ఆ దారిలో గంజాయి తరలిపోతుందని పక్కా సమాచారం ఉంది.ఈ డైలమాలో ఉంటూనే అంబులెన్స్ ఆపారు. లోపల తనిఖీలు చేసిన అధికారులు ఆశ్చర్యపోయారు.
అంబులెన్స్ లోపల361 గంజాయి ప్యాకెట్లుఉన్మట్టు గుర్తించారు.ఒక్కో ప్యాకెట్‌లో ఐదు కిలోల చొప్పున మాదకద్రవ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు యత్నించారు. ఈ సరకు విలువ 2 కోట్ల 72 లక్షలు ఉంటుందని అధికారులులెక్కగట్టారు. వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు.
చెన్నై కోల్‌కతా రహదారి నిత్యం ఇలాంటి రవాణా జోరుగా సాగుతుందని ముందుస్తు సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ మార్గంలో నిఘా పెరిగిందని గ్రహించిన గంజాయి రవాణా ముఠా... అంబులెన్స్‌లను తమ అక్రమాలకు వినియోగించుకుంటున్నారు.