ETV Bharat / state

పోలీస్ స్టేషన్ ఎదురుగా సినిమా తరహాలో రోడ్డు ప్రమాదం - visakha district updates

విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. సిని ఫక్కీ తరహాలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా... ఎటువంటి ప్రాణ నష్టం జరగగ పోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

road accident in front of nakkapalli police station
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 25, 2021, 10:11 PM IST

నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా సినిమా తరహాలో రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రమాదం జరిగింది. రెప్పపాటు కాలంలో సినిమా యాక్షన్​ను తలపించేలా ఈ సంఘటన జరిగింది. రోడ్డు మధ్యలో ఆగిపోయిన లారీని వెనుక వస్తున్న కార్లు ఒకదానికొకటి.. అలా మూడు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగగ పోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై మరమ్మతులు చేపట్టేందుకు నేషనల్ హైవే సిబ్బంది చర్యలు చేపట్టారు. వాహనాలను క్రమబద్దీకరించేందుకు స్టాపర్స్​ను ఏర్పాటు చేశారు. తుని నుంచి విశాఖపట్నం వైపు వేగంగా వస్తున్న లారీ రహదారిపై ఉన్న స్టాపర్స్​ను తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయటంతో రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అదే సమయంలో వెనుక వస్తున కారు ఆ లారీ ఢీ కొట్టింది. ఆ కారు వెనుక వస్తున్న మరో కారు, ఆ కారు వెనుకు వస్తున్న మరో కారు.. ఇలా మూడు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. మధ్యలోని కారులో ఇరుక్కున్న ప్రయాణికులు ప్రాణభయంతో ఆక్షిజన్ అందక ఇబ్బందులు పడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు అప్రమత్తమై అక్కడికి చేరుకుని ప్రయాణికులను రక్షించటానికి డోర్లు తీయటానికి ప్రయత్నించగా.. కారు తలుపులు తెరుచుకోలేదు. దీంతో కారు అద్దాలు పగులకొట్టి వాహనంలో ఉన్న నలుగురిని బయటకు తీశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగ పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: CM JAGAN: 'కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండండి.. మరోసారి సీఎం హెచ్చరిక'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.