ETV Bharat / state

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు : మంత్రి ఆళ్ళ నాని - మంత్రి అవంతి శ్రీనివాసరావు

రాబోయే వర్షకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఉన్నందున.. అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్​లతో కలసి ఏజెన్సీ ప్రాంతాల్లోని వైద్యసేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

minister alla nani review meeting in medical services in agency areas
ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష
author img

By

Published : Jun 3, 2020, 10:55 PM IST

ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష

రానున్న రోజుల్లో విషజ్వరాల బారినపడి ఒక్క మరణం కూడా సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. బుధవారం పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, వైద్య, పంచాయతీ శాఖ అధికారులతో ఆళ్ల నాని సమావేశమయ్యారు. ఏజెన్సీ ప్రాంతాలలో వైద్య సేవలు, ఆసుపత్రులలో మౌలిక వసతులు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్​లు పాల్గొన్నారు.

పాడేరులో వైద్యకళాశాల ఏర్పాటు: మంత్రి ఆళ్లనాని

రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎన్ని విమర్శలు వచ్చినా పాడేరులో కళాశాల ఏర్పాటుకు నిర్ణయించారని మంత్రి ఆళ్లనాని చెప్పారు. వర్షాకాలం రాబోతోందని కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన గ్రామాలు చాలా దూరంగా ఉంటాయని... కాబట్టి అవసరమైన చోట్ల ప్రాథమిక కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.16 వేల కోట్లతో ఆసుపత్రులన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

విలేజ్ క్లినిక్​లు ఏర్పాటు..

రాష్ట్ర వ్యాప్తంగా జులై 8వ తేదీ నాటికి 108, 104 వాహనాలు మొత్తం 1,005 ప్రతి మండలానికి పంపించడం జరుగుతుందని మంత్రి ఆళ్లనాని అన్నారు. వాహనాల కేటాయింపులో గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. గిరిజన ప్రాంతాలలో రహదారుల ప్రాముఖ్యతపై ఆర్ అండ్ బి పంచాయతీ రాజ్ శాఖల మంత్రులతో చర్చించనున్నట్లు తెలిపారు. దీనికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో పరిశుభ్రమైన తాగునీరు అందించడానికి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ సచివాలయ పరిధిలో విలేజ్ క్లినిక్ లు పనిచేస్తాయని, శ్రీకాకుళం విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో గిరిజనుల కోసం సహాయ కేంద్రాలుగా ఎస్.టి. సెల్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అవసరమైన సలహాలు ఇవ్వండి: మంత్రి అవంతి

గిరిజన ప్రాంతాల్లోని అన్ని పీహెచ్​సీలు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి అధికారులు అవసరమైన సలహాలను ఇవ్వాలని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో సి.ఎస్.ఆర్. నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి గిరిజనులకు వైద్య సేవలతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

గిరిజనులకు అందుబాటులో వైద్యవిద్య: మంత్రి ధర్మాన

పాడేరులో 35 ఎకరాల స్థలంలో రూ.400 కోట్లతో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులు అందరికీ మంచి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, వైద్యవిద్య కూడా గిరిజనుల దగ్గరవుతోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. సీజన్ కు ముందుగానే వైద్య సేవలపై సమీక్ష నిర్వహించడం మంచి ఫలితాలనిస్తుంది అన్నారు. కళాశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పాడేరులో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ను పునరుద్ధరించాలని కోరారు.

ఇవీ చదవండి: పాడేరుకు ముగ్గురు మంత్రులు... వైద్య కళాశాల స్థలం పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.