విశాఖ కేంద్రంగా జరిగిన భూకబ్జాలు, రికార్డుల తారుమారు తదితర అంశాలపై చేపట్టిన విచారణపై.. నివేదిక సిద్ధమైందని సిట్ ఛైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయకుమార్ తెలిపారు. తమ విచారణలో వెలుగుచూసిన అన్ని అంశాలను ప్రస్తావించామని, ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలకు అనుగుణంగా పలు సిఫార్సులు చేశామని వెల్లడించారు.
సిట్ కార్యాలయంలో సభ్యులు వైవీ అనూరాధ, భాస్కర్‌రావుతో సమావేశమై నివేదికకు తుది మెరుగులు దిద్దామని తెలిపారు. ఆ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. నివేదిక పూర్తిస్థాయిలో సిద్ధమైందని, సీఎం అపాయింట్‌మెంట్ దొరకగానే అందజేస్తామని తెలిపారు. తమ సిఫార్సులు అమలైతే 350 నుంచి 400 ఎకరాల భూములు వెనక్కి వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి: