కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి ఆటంకం ఉండదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరుకుల పంపిణీని యథావిధిగా చేపడతామని చెబుతున్నారు. పాక్షిక కర్ఫ్యూ ప్రభావం పంపిణీపై పడదన్నారు.
వాలంటీర్లకు కీలక బాధ్యతలు..
రేషన్ సరుకులను అందజేసే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఉచితంగా రేషన్ సరకుల పంపిణీ చేపట్టాల్సి ఉండగా.. ఈ ప్రక్రియ తమకు భారమని.. కమిషన్ను రెట్టింపు చేయాలని డీలర్లు ఆందోళన చేస్తున్నారు.
రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. 8886671713 అనే నెంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: