కరోనా నుంచి రక్షణకు ఒకరికొకరు మీటరుకు పైగా దూరంగా ఉండాలని వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు విస్మరిస్తున్నారు. మరికొందరు నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా తిరుపతి డీఆర్ మహల్ సమీపంలోని చౌక ధరల దుకాణం దగ్గర బియ్యం కోసం జనం దూరం పాటించకుండా కిక్కిరిసి నిలుచున్నారు. ఇందుకు భిన్నంగా విశాఖ మన్యం ఉక్కుర్భ గ్రామంలో ప్రజలు దూరదూరంగా ఉంటూ ఆదర్శంగా నిలిచారు. ఉదయాన్నే బియ్యం కోసం డీఆర్ డిపోల దగ్గరకు వచ్చి తమ వంతు వచ్చేదాకా ఎండలోనే కూర్చుని వేచిచూశారు.
సామాజిక దూరం పాటిచడంలో గిరిజనుల స్పూర్తి
కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు సామాజిక దూరమే ముఖ్య ఆయుధమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు ఆ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు. కానీ విశాఖ మన్యం ఉక్కుర్భ గ్రామంలోని ప్రజలు దుకాణాల వద్ద దూర దూరంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.