విశాఖ మన్యం కొండ ప్రాంతాల్లో వివిధ రకాల జంతు సంపద ఉండేది. అయితే పెరుగుతున్న జనసాంద్రత.. పోడు వ్యవసాయం వల్ల జంతుజీవం అంతరించిపోతోంది. మన్యంలో అరుదుగా కనిపించే ఓ ములుగు పిల్లి జాతి ఉంది. రాత్రులు తప్ప పగలు అసలు ఎవరి కంటికీ కనిపించదు. మన్యం మారుమూల పాడేరు మండలం వంటల మామిడిలో ఓ రైతు పొలంలో ములుగు పిల్లి పిల్లను వదిలి వెళ్ళిపోయింది. చిన్నపిల్లగా ఉండడంతో ఆ రైతు దానిని చేరదీశాడు. ఇంటిలో ఆవాసం ఏర్పాటు చేసి పెంచుతున్నాడు. ఇప్పటికే నాలుగు నెలలు అయింది. ప్రతిరోజు ఇంట్లో అందరి ముందు తన ఆవాసంలో కలియ తిరుగుతూ ఆనందాన్ని కలిగిస్తోంది.
ఇదీ చూడండి