కరోనా సమయంలో విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ పడకలను పెంచి రోగులకు వైద్యసేవలు అందించాలని.. రాంకో సిమెంట్ కర్మాగారం యాజమాన్యం రూ.20 లక్షల విరాళాన్ని అందించింది. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో.. చెక్కును ఎన్టీఆర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్కు అందజేశారు.
కరోనా రోగులకు సాయం అందించడానికి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రాంకో సిమెంట్ యాజమాన్యం రూ.20 లక్షల నిధులను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చెప్పారు. లారెస్ కంపెనీ సైతం రూ.5 లక్షలు విరాళం ఇచ్చిందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో.. వైద్య సిబ్బంది పనితీరుపై కొందరు ఆరోపణలు చేయటం తగదని చెప్పారు.
ఇదీ చదవండి: