ETV Bharat / state

GVL Narasimha Rao: పరిశుభ్రతలో దేశంలోనే మెుదటి స్థానంలో విశాఖ రైల్వే స్టేషన్​...

రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం రైల్వే స్టేషన్​ను సందర్శించారు. పరిశుభ్రతలో దేశంలోనే విశాఖ రైల్వేస్టేషన్ మొదటి స్థానంలో ఉందని.. ఇక్కడి మౌలిక వసతులు చాలా బాగున్నాయని కొనియాడారు.

GVL Narasimha Rao
రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు
author img

By

Published : Sep 16, 2021, 7:34 AM IST

విశాఖపట్నం రైల్వే స్టేషన్​ను రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సందర్శించారు. ఒకటి, ఎనిమిది ప్లాట్ ఫారంలను పరిశీలించిన ఆయన ఇక్కడ సౌకర్యాలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్​లో సౌకర్యాలను పరిశీలించామని.. రైల్వే స్టేషన్​ను చాలా పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారని కితాబిచ్చారు.

పరిశుభ్రతలో దేశంలోనే విశాఖ రైల్వేస్టేషన్ మొదటి స్థానంలో ఉందని.. ఇక్కడి మౌలిక వసతులు చాలా బాగున్నాయని. వాటిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. భవిష్యత్​లో 600 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్లను.. ఎయిర్ పోర్ట్​లకు ధీటుగా అబివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ పర్యటనలో జీవీఎల్​తో పాటు ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్​ రాజు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ.. NCRB: రాష్ట్రంలో నేరాలు 15 శాతం తగ్గాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.