తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు నిరసన చేపట్టారు. వాల్తేరు డివిజన్ ఎత్తివేయాలంటూ వచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన డివిజన్ హెడ్ క్వార్టర్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వాల్తేరు డివిజన్ ఉద్యోగులను అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టివేసిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ను రాయగడ, వాల్తేరు డివిజన్లుగా చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ నాయకులు డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి ఆమె జన్మదిన వేడుక... ఎందరికో ఆదర్శం.