విశాఖ కంచరపాలెంలో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్, కంచరపాలెం పోలీసులు దాడులు నిర్వహించారు. చాకలి గెడ్డ సమీపంలోని పాడుబడ్డ రైల్వే క్వార్టర్స్‌లో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్, కంచరపాలెం పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ.80వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి. భార్య వెంటే భర్త 'అనంత'లోకాలకు.. అనాథలైన చిన్నారులు