ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జులై 3న నిరసనలు

కేంద్ర ప్రభుత్వ... కార్మిక, ఉద్యోగ, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జులై 3న సహాయ నిరాకరణకు సమాయత్తం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు జి.వామనమూర్తి పిలుపునిచ్చారు.

vishaka district
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జూలై 3వ తేదీన నిరసనలు
author img

By

Published : Jun 25, 2020, 7:35 AM IST

విశాఖ నగరంలోని మధురవాడ సీపీఐ కార్యాలయంలో... భారత్-చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తూ గోడ పత్రికను ఆవిష్కరించారు. పేద ప్రజలను విస్మరించి కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తోందని, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తక్కువగా ఉన్నప్పటికీ దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు జీ.వామనమూర్తి విమర్శించారు. పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించకుంటే కార్మిక, కర్షక, సామాన్య ప్రజల మద్దతుతో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్టు ప్రకటించారు.

ఇది చదవండి టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మానం వెంకట ప్రణవ్ గోపాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.