ETV Bharat / state

12న విశాఖకు ప్రధాని.. 11న నిరసనలకు ఉక్కు పరిరక్షణ వేదిక పిలుపు

author img

By

Published : Nov 6, 2022, 4:01 PM IST

Visakha Steel Plant: ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి మెదీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో.. 11వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు.. విశాఖ ఉక్కు పరిరక్షణ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్​ప్లాంట్​ అమ్మడాన్ని ఆపాలని కోరారు. విశాఖ స్టీల్​ప్లాంట్ పరిరక్షణ కోసం గత 632 రోజుల నుంచి నిరసనలు చేస్తునట్లు తెలిపారు.

12న విశాలో ప్రధాని పర్యటన
Visakha Steel Plant

Visakha Steel Plant in ap: విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ.. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేకహొదా కేటాయించాలని కోరుతూ నవంబర్ 11వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక నాయకులు విజయవాడలో తెలిపారు. గత 632 రోజులుగా స్టీల్ ప్లాంట్​లోనూ, విశాఖ నగరంలోనూ వివిధ రూపాల్లో నిరసనలు చేపడుతున్నామన్నారు. ప్రధానమంత్రి మోదీ నవంబర్ 12వ తేదీ విశాఖలో జరిగే బహిరంగ సభలో విశాఖ స్టీల్​ప్లాంట్​ను అమ్మడాన్ని ఆపివేస్తామని ప్రకటించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను కావాలని సష్టాల్లో నెట్టేందుకు ఉత్పత్తిని ఇటీవల కాలంలో 50% తగ్గించారన్నారు. సొంత గనులు లేనందువల్ల ప్రతి సంవత్సరం రూ.2 వేలకోట్లు విశాఖ స్టీల్ అదనంగా నష్టపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను, ప్రత్యేక హోదాను అమలు చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక డిమాండ్ చేస్తుందని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.