విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధి పీఎల్ పురంలో దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు పంపిణీ చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ కోరారు. గ్రామంలో సర్వే నంబర్ 172 పరిధిలో 18 ఎకరాల భూమిలో కొన్నేళ్లుగా పది దళిత కుటుంబాల వారు తోటలు సాగు చేస్తున్నారని వివరించారు. సంబంధిత భూములకు పట్టాదారు పుస్తకాలు జారీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన రెవిన్యూ అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. అధికారులు న్యాయం చేయకుంటే జాతీయ ఎస్సీ, ఎస్టీ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇదీ చూడండి: భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులిచ్చిన భర్త