విశాఖ ఉక్కు పరిశ్రమ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విజయవాడలో సైకిల్ యాత్ర చేపట్టారు. విజయవాడ నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని నిరసనకారులు తెలిపారు. ప్రైవేటీకరణ అనే అంశంతో భాజపా ప్రభుత్వం రాజ్యంగంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్ మాదిగ ఆరోపించారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
జీవీఎంసీ గాంధీ పార్కులో...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ.. జీవీఎంసీ గాంధీ పార్కులో అఖిలపక్ష కార్మిక సంఘాలు నిరవధిక నిరాహార దీక్షలకు దిగారు. ఈ దీక్షకు దళిత సంఘాల ఐక్యవేదిక మద్దతు తెలిపింది.
గుంటూరులో...
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. ఈనెల 18న విశాఖ ఆర్కే బీచ్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పోరాటాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్తామన్న కోటేశ్వరరావు.. 18న నిర్వహించే బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఇవీచదవండి.