ETV Bharat / state

మద్యం దుకాణాలు మూసివేయాలంటూ ఆందోళన - విశాఖపట్నం జిల్లాలో కరోనా కేసులు

మద్యం షాపులు తెరవడంపై మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు వాటిని తెరవొద్దని మహిళలు, పలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేస్తున్నారు.

protest against to opening wine shops in vizag district
మద్యం దుకాణాలు మూసివేయాలంటూ ఆందోళన
author img

By

Published : May 4, 2020, 5:56 PM IST

మద్యం దుకాణాలను తెరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ విశాఖపట్నంలో సీపీఎం నగర పాలక కమిటీ నిరసన దీక్ష చేపట్టింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మద్యం దుకాణాల వద్ద ప్రజలు భారీగా గుమిగూడిన కారణంగా... వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. షాపులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు.

అనకాపల్లి మండలంలో...

అనకాపల్లి మండలం కొత్తూరు నరసింగరావుపేటలో మద్యం దుకాణాల వద్ద మహిళలు అందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మద్యం షాపులను మూసివేయాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.