విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం ఆడారిమెట్ట గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెళ్తుండగా... చింతలవీధి వద్ద కొవిడ్ వైద్య సిబ్బంది మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కరోనా బాధితులకు సేవలందించిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరు నెలల కాలానికి జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ ఆందోళనపై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్... వైద్య సిబ్బందిని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అయినప్పటికీ ఆందోళన వీడకపోవడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీచదవండి.