విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థకు 2002 నుంచి పర్యావరణ అనుమతులు లేవని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు ఆరోపించారు. ప్రమాద సమయంలో కనీసం సైరన్ కూడా మోగించలేదని సంస్థ తీరుపై ఆగ్రహించారు. ఇప్పటికే 14 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ప్రమాదాల నివారణలో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తోందని అసంతృప్తి చెందారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు విశాఖ సింహాచలం కూడలిలో మానవ హారం చేస్తామన్నారు. ఎల్జీ పాలిమర్స్ కు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: